India, China to Hold Top Level Military Talks on January 12

తూర్పు లద్దాఖ్ లో వివాదాస్పద అంశాల పరిష్కారానికి భారత్ చైనా మధ్య జనవరి 12న 14వ విడత సైనిక చర్చలు జరగనున్నాయి. చైనా భూభాగంలోని చుషుల్ మోల్దో ఈ చర్చలకు వేదిక కానుంది. వివాదాస్పద ప్రాంతాల సమస్య పరిష్కారం దిశగా ఈ సమావేశంలో నిర్మాణాత్మక చర్చల కోసం ఎదురుచూస్తున్నట్లు భారత్ తెలిపింది. L.A.C వద్ద వివాదాస్పద…

India, China to Hold Top Level Military Talks on January 12

Source

0
(0)

తూర్పు లద్దాఖ్ లో వివాదాస్పద అంశాల పరిష్కారానికి భారత్ చైనా మధ్య జనవరి 12న 14వ విడత సైనిక చర్చలు జరగనున్నాయి. చైనా భూభాగంలోని చుషుల్ మోల్దో ఈ చర్చలకు వేదిక కానుంది. వివాదాస్పద ప్రాంతాల సమస్య పరిష్కారం దిశగా ఈ సమావేశంలో నిర్మాణాత్మక చర్చల కోసం ఎదురుచూస్తున్నట్లు భారత్ తెలిపింది. L.A.C వద్ద వివాదాస్పద ప్రాంతాల్లో సైనిక బలగాల ఉపసంహరణపైనే ఈ చర్చల్లో భారత్ ప్రధానంగా దృష్టి సారిస్తుందని వివరించింది. 2020 మే 5న తూర్పు లద్దాఖ్ లోని పాంగాంగ్ సరిహద్దు వద్ద భారత్ , చైనా సైనికుల మధ్య ఘర్షణతో ఇరుదేశాల మధ్య వివాదం ఏర్పడింది. ఈ వివాద పరిష్కరానికి ఇరు దేశాల సైనిక అధికారులు ఇప్పటి వరకు 13 సార్లు భేటీ అయినా చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. రెండు దేశాల సైనిక అధికారుల చర్చలు చివరి సారిగా 2021 అక్టోబర్ 10న జరిగాయి.
#EtvAndhraPradesh
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
—————————————————————————————————————————-
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
—————————————————————————————————————————–
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
—————————————————————————————————————————–

0 / 5. 0